పట్నాలో ఇసుక మాఫియాల మధ్య కాల్పులు.. నలుగురు మృతి

-

బిహార్​లోని పట్నా జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ముఠాల మధ్య వివాదం తలెత్తింది.  మాటామాటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. తొమ్మిది మంది గాయపడ్డారు.

జిల్లాలోని బిహ్తా పోలీస్​స్టేషన్ పరిధిలోని సోన్ నది తీరంలోని ఇసుకను కొందరు ముఠాలుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.  గురువారం రోజున రెండు గ్రూపుల మధ్య ఇసుక రవాణా విషయంలో చిన్న వివాదం తలెత్తింది. అనంతరం మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది మంది గాయపడ్డారు.

ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. సోన్​ నది వద్దకు చేరుకున్నారు. మృతులను మానేర్ పోలీస్​స్టేషన్‌ పరిధికి చెందిన శతృఘ్న, హరేంద్ర, లాల్‌దేవ్​, విమలేశ్​ కుమార్​గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాల కోసం సోన్​ నదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news