ప్రేమకు ఒప్పుకోకపోవడంతోనే గొంతు కోశా … హన్మకొండ ఘటనలో నిందితుడు అజార్ వెల్లడి

-

హన్మకొండలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించింది. ప్రేమ పేరుతో వేధిస్తున్న అజార్ అనే యువకుడు అనూష అనే యువతిపై దాడి చేసి గొంతు కోశారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నిందితుడు అజార్ ను పట్టుకున్నారు. 

తన ప్రేమకు ఒప్పుకొనందుకే తాను గొంతు కోశానని పోలీస్ విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడు అజార్ ను పట్టుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారణ జరిపారు. నిందితుడి నుంచి కీలక విషయాలు రాబట్టారు. హన్మకొండ సుబేదారి పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు కింద ఐపీసీ సెక్షన్లు 354, 307, 506 కింద కేసులు నమోదు చేశారు. ఆతరువాత నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్ట్ తీర్పు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news