కరోనా నేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు, కార్మికులు ప్రస్తుతం పీపీఈ కిట్లను ధరిస్తున్నారు. అయితే ఓ దొంగ మాత్రం దీన్నే ధరించి భారీ ఎత్తున బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఆగ్నేయ ఢిల్లీలోని కల్కాజీలో ఉన్న అంజలీ జ్యువెల్లరీ షోరూంలో జనవరి 19వ తేదీన రాత్రి 9.40 గంటలకు ఓ దొంగ ప్రవేశించాడు. మరుసటి రోజు తెల్లవారు జామున 3.50 గంటల వరకు షోరూంలో ఉన్నాడు. భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. అయితే దొంగకు చెందిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయినప్పటికీ అతను పీపీఈ కిట్ ధరించి ఉండడంతో అతన్ని గుర్తించడం కష్టంగా మారింది. ఇక పీపీఈ కిట్ కారణంగా చేతి వేలి ముద్రలు కూడా లభించలేదు. దీంతో దొంగను గుర్తు పట్టలేకపోతున్నారు.
दिल्ली के कालका जी इलाके में हुई 25 किलो सोने की चोरी के आरोपी को @CPDelhi के @DCPSEastDelhi ने महज़ 48 घंटों में गिरफ्तार कर लिया। @indiatvnews #CCTV pic.twitter.com/FL1749MnFW
— Sonu Kumar🇮🇳 (India TV) (@Sonu_indiatv) January 21, 2021
అయితే జ్యువెల్లరీ షోరూం బయట నిజానికి 5 మంది సిబ్బంది కాపలా ఉన్నారు. అయినప్పటికీ దొంగ లోపలికి ప్రవేశించడం అంత సేపు దొంగతనం చేయడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఈ క్రమంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రప్పించి క్లూస్ కోసం వెతుకుతున్నారు. కాగా చోరీ అయిన ఆభరణాల విలువ సుమారుగా రూ.6 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.