పెళ్లి చేసుకోను అని చెప్పింది అని, ముక్కు, చెవులు నరికేశారు

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌ లో 30 ఏళ్ల వితంతువుని అత్తమామలు దారుణంగా హింసించారు. వారి కోరిక మేరకు తిరిగి వివాహం చేసుకోవడానికి ఆమె నిరాకరించడంతో ఆమె ముక్కు, నాలుకను నరికివేసినట్లు పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. మహిళను చికిత్స కోసం జోధ్పూర్ లోని ఆసుపత్రిలో చేర్చారు.

నిందితులలో ఒకరు జాను ఖాన్ ని అరెస్ట్ చేసామని చెప్పారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసు అధికారి పోకరన్ మోతారామ్ మాట్లాడుతూ… తమ బంధువులలో ఒకరిని వివాహం చేసుకోవాలని మహిళ అత్తమామలు కోరుకుంటున్నారని దానికి ఆమె నిరాకరించింది అని చెప్పారు. ఆమె ముక్కు, నాలుకపై పదునైన ఆయుధంతో దాడి చేసారు అని పేర్కొన్నారు. ఈ ఘటన సంచలనం అయింది.