అంతా బిజెపి వల్లే… ఇరుకున పెట్టేసిన కేసీఆర్…!

హైదరాబాద్ లో వరద సాయం ఆపేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంపై సిఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ఆయన తీవ్ర విమర్శలు చేసారు. ఈసీకీ బిజెపి ఫిర్యాదు చేయడం వలనే వరద సాయం ఆగింది అని ఆయన ఆరోపించారు. వరద సాయం ఆపింది బిజెపినే అని ఆయన మండిపడ్డారు. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది.

వరద బాధితుల నుంచి 2 లక్షల అభ్యర్ధులను వచ్చాయని అన్నారు. 1.6 లక్షల మందికి సాయం చేసామని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఆపినా సరే ఎన్నికల తర్వాత మిగిలిన వారికి సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల్లో వరద సాయంపై ముందు నుంచి కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణం అని ఆయన అన్నారు.