ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ మొత్తం లో బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 32 కోట్ల విలువ చేసే 61 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుండి ముంబాయి చేరుకున్న 7 మంది ప్రయాణీకుల వద్ద బంగారు బాస్కెట్ లను గుర్తించారు. కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి గోల్డ్ తరలించే యత్నం చేసింది స్మగ్లర్స్ గ్యాంగ్.
పథకం ప్రకారం 61 కేజీల బరువు ఉన్న బిస్కట్లను 7 బాగాలుగా డివైడ్ చేసి నడుము బెల్టు లో దాచి తరలించే యత్నం చేసింది ఈ గ్యాంగ్ . స్పెషల్ గా అరబ్ కంట్రీ లో నడుము బెల్ట్ తయ్యారు చేయించారు కేటుగాళ్లు. ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల దృష్టి మరలించడానికి కస్టమ్స్ అధికారులతో వాగ్వాదం కు దిగారు స్మగ్లర్స్ గ్యాంగ్. దీంతో అనుమానం వచ్చి చాకచక్యంగా వ్యవహరించి గ్యాంగ్ ఆట కట్టించారు కస్టమ్స్ బృందం. టాంజానియా వయా దోహా మీదుగా వచ్చారు స్మగ్లర్స్.
దోహా ఎయిర్ పోర్ట్ లో బంగారు బిస్కెట్లతో ఉన్న నడుము బెల్ట్ ను సుడాన్ జాతీయుడు వారికి అప్పగించినట్లు ఒప్పుకున్నారు స్మగ్లర్స్. దీంతో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. గోల్డ్ ను ముంబాయి లో ఎవరికి ఇవ్వడానికి తెచ్చారు అనే విషయం పై ఆరా తీస్తున్నారు. పట్టుబడ్డ స్మగ్లర్స్ లో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం. ముంబాయి ఎయిర్ పోర్ట్ లో రికార్డు స్థాయిలో 61 కేజీల బంగారం పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటి సారి.