పాముకాటుకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారిపై సామూహిక అత్యాచారం

-

అబ్బ.. ఇది ఘోరం. ఘోరాతి ఘోరం. చెప్పలేని ఘోరం. మనుషుల్లో మానవత్వం మంటగలిచిందని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.  ఓవైపు పాము కాటుకు గురై ఐసీయూలో చిన్నారి చికిత్స పొందుతుంటే.. ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు ఆసుపత్రి సిబ్బంది. నిజంగా ఈ ఘటన చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేటు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటు చేసుకున్నది. బరేలీ జిల్లాకు చెందిన ఓ బాలికను నాగుపాము కాటేసింది. దీంతో వెంటనే ఆ బాలికను బరేలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాగుపాము కాటు కావడంతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు.

దాన్నే అదునుగా భావించిన ఆసుపత్రి ఉద్యోగి, అతడి నలుగురు స్నేహితులు ఆ బాలికపై కన్నేశారు. ఐసీయూలో డాక్టర్లు లేని సమయం చూసుకొని.. ఐసీయూలోకి వెళ్లి తనపై అత్యాచారం చేయబోయారు. ఆ అమ్మాయి వాళ్లను ప్రతిఘటించడంతో బాలికను తాళ్లతో మంచానికి కట్టేసి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధిత బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు తనను డాక్టర్లు జనరల్ వార్డుకు తరలించిన తర్వాత తనపై జరిగిన ఘోరాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రి ఉద్యోగి నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version