ఢిల్లీలో దారుణం..ప్రియురాలిని 35 ముక్కలుగా నరికిన ప్రియుడు

ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది..ప్రియురాలిని 35 ముక్కలుగా నరికాడు ఓ ప్రియుడు. ఈ సంఘటన ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీకి చెందిన శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావల్లా ఇద్దరు ప్రేమికులు. గత కొన్ని రోజులు వీరు సహజీవనం చేశారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని.. శ్రద్ధ, అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను వేడుకోంది.

దీంతో..ఆగ్రహానికి లోనైన అఫ్తాబ్.. శ్రద్ధను హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు ఢిల్లీలోని మెహ్రౌలీ అడవుల్లో పడేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మే 18న ఈ హత్య జరుగగా, తాజాగా ఈ కేసులో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అఫ్తాబ్ అమీన్ పూనావల్లా రిమాండ్‌ లో ఉన్నాడు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.