కామంతో కళ్లు మూసుకుపోయి.. ఉద్యోగినితో అక్రమ సంబంధం.. సీఈవో పోస్టు ఔట్..?

-

అందమైన అమ్మాయిని చూస్తే.. బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుందంటారు. ఇక మానవులు ఓ లెక్కా.. కామాతురాణం న భయం.. న లజ్జ అన్న నానుడి కూడా ఊరికే రాలేదు. అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, లజ్జ ఉండవని అర్థం. ఇదే కామం ఉచ్చనీచాలు కూడా మరపింపజేస్తుందని మరో ఉదాహరణ నిరూపించింది.

తన కింద పని చేసే ఒక ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ బహుళ జాతీయ సంస్థ సీఈవో ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగినితో ఆ సంబంధం పెట్టుకున్నందుకు మెక్ డోనాల్డ్ సంస్థ.. తమ ప్రెసిడెంట్, సీఈవో అయిన స్టీవ్ ఈస్టర్ బ్రూకన్ ను పదవి నుంచి పీకేసింది. ప్రస్తుతం మెక్ డొనాల్డ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ గా ఉన్న క్రిస్ కెంప్ జింకీని సీఈఓగా నియమించింది.

ఇక తోటి ఉద్యోగితో కామంతో కక్కుర్తిపడినందుకు సీఈవోను తొలగిస్తున్నట్టు తన ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలిపింది. కంపెనీ నిబంధనావళిని అతిక్రమించినందుకు ఈస్టర్ బ్రూకును కంపెనీ నుంచి తొలగించామని ప్రకటించింది. ఒక ఉద్యోగినితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఇందుకు కారణమని ప్రకటించింది.

ఈ విషయంపై తొలగించబడిన ఈస్టర్ బ్రూక్ కూడా తన తప్పును అంగీకరిస్తున్నాడు. కంపెనీ విధానాలను అతిక్రమిస్తూ, ఉద్యోగినితో లైంగిక సంబంధం పెట్టుకోవడం తప్పేనని ప్రకటించాడు.’కంపెనీ విలువలను అనుసరించి, బోర్డు నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ప్రకటించి కంపెనీ నుంచి నిష్క్రమించాడు. ఇక ఇప్పుడు సదరు ఉద్యోగినితో రాసలీలలకు బ్రూక్ కు ఫుల్ టైమ్ దొరుకుతుందేమో అని గుసగుసలాడుకుంటున్నారు మెక్ డోనాల్డ్ ఉద్యోగులు.

Read more RELATED
Recommended to you

Latest news