తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. మంత్రితో పాటు అతని సోదరుడిని హత్య చేసేందుకు రూ.12 కోట్ల సుపారీని మాట్లాడుకోగా.. ప్లాన్ అమలు చేయడానికి ముందే పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు. నిందితులను పేట్ బహీరాబాద్ లో అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో పూర్తి వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు.
సైబరాబాద్ పోలీసులు కొంతమంది సుపారీ కిల్లర్స్ ను పోలీసులు అదుపులోకీ తీసుకోగా.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసే కుట్ర బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో ఈ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ గౌడ్ ను పథకం ప్రకారం హత్య చేయాలని ప్లాన్ చేయాలనుకున్నారని… త్వరలోనే పథకాన్ని అమలు చేసేందుకు చూశారని.. ఈలోపే పోలీసుకు సమాచారం రావడంతో పేట్ బషీరాబాద్ లో కొంత మందిని అదుపులోకీ తీసుకోవడంతో ఈకుట్ర భగ్నం అయింది. అయితే ఈ కుట్రకు పాల్పడ్డ సూత్రధారులెవరు అనే విషయాలను మీడియాకు స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు.
ఈ హత్య కోసం ఫరూక్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఫరూక్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్ తో పాటు ఢిల్లీలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో పని చేసే రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ హత్యకు సంబంధించి 7గురిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.