మాదాపూర్ గన్ హల్ చల్ కేసులో కొత్తకోణం

-

మాదాపూర్ లో గన్ తో హల్చల్ చేసినన కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో సంజీవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే విషయంం తెలిసిందే. మాదాపూర్ లోని సర్వేనెంబర్ 10 లో రియాల్టర్ సంజీవరెడ్డి గన్ తో బెదిరింపులకు పాల్పడ్డారు. నిర్మాణంలో ఉన్న భూమిలో తనకు కాంట్రాక్టు దక్కలేదని కోపం పెంచుకున్న సంజీవరెడ్డి.. కాంట్రాక్ట్ చేస్తున్న సుబ్బయ్య పై గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు.

అయితే ఈ కేసులో సురేష్ బాబు కి సంబంధం లేదని తేల్చారు పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే సంజీవరెడ్డి నిర్మాత సురేష్ బాబు పేరు ఉపయోగించుకుంటున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. సురేష్ బాబు ల్యాండ్ ను సంజీవరెడ్డి డెవలప్మెంట్ కి తీసుకున్నాడు కాబట్టే వారి పేరుని ఉపయోగించుకుంటున్నాడని అన్నారు. మాకు సురేష్ బాబు తో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు.

మరోవైపు ఈ కేసుపై డిసిపి శిల్పవల్లి మాట్లాడుతూ.. సంజీవరెడ్డిని ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు. తమ భూమిలో సంజీవరెడ్డి అక్రమంగా ప్రవేశించి అందులో పనిచేస్తున్న వారిని తన వద్ద ఉన్న గన్ తో బెదిరించాడని.. కాంట్రాక్టర్ సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version