ఒక్క అక్రమ సంబంధం పోలీసులకు చుక్కలు చూపిస్తుంది…!

-

భర్త విదేశాల్లో ఉండటంతో కోరికలు ఆపుకోలేని ఒక మహిళ బరి తెగించింది. డ్రైవర్ తో అఫైర్ పెట్టుకుని పిల్లలను కూడా వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. కన్యాకుమరి జిల్లా తిరుపట్టార్ ప్రాంతానికి చెందిన సంగీత (35), శరవణ దంపతులకు కొన్నేళ్ళ క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఉపాధి నిమిత్తం శరవణ కొన్నాళ్లుగా విదేశాల్లోనే ఉంటున్నాడు.

అప్పుడప్పుడు ఇండియా వచ్చి భార్యా బిడ్డలను కలిసి వెళ్ళే వాడు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన సంగీత తిరుపట్టార్ ప్రాంతంలోని ఓ స్కూల్లో టీచర్‌ గా ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలోనే కోరికలను అదుపు చేసుకోలేని సంగీత అదే స్కూల్ లో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత కొన్నాళ్ళు గా వీరు అక్రమ సంబంధ౦ ఏ ఇబ్బంది లేకుండా గడుపుతున్నారు.

అక్కడి వరకు ఆగితే బాగానే ఉండేది గాని ఆ తర్వాత వాళ్ళు కాస్త రెచ్చిపోయారు. ప్రియుడి తో కలిసి ఆమె వెళ్లిపోయింది. దీనితో సంగీత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెతికి పట్టుకొచ్చారు పోలీసులు. సంగీతకు కూడా కుటుంబ సభ్యులు భర్తకు తెలియకుండా వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే ఆవిడలో ఏ మార్పు కనపడలేదు. అక్రమ సంబంధం కొనసాగించింది.

మరోసారి తన ప్రియుడి తో కలిసి ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. దీనితో మరోసారి సంగీత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చేపట్టారు. అయితే ఇక్కడ పోలీసులు చుక్కలు చూస్తున్నారు. ఆ ఇద్దరికీ దాదాపు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే మార్పు రాలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవడం తో వాళ్ళ కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news