జైలునుంచి విడుదలైన మారుతీ రావు.. తమకు ప్రాణ భయం ఉందన్న అమృత

-

ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుదలవ్వడంతో.. తమకు ప్రాణ హాని ఉందని ప్రణయ్ భార్య, మారుతీ రావు కూతురు అమృత వాపోతున్నారు. ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తన కూతురును పెళ్లి చేసుకున్నాడని.. అత్యంత కిరాతకంగా ప్రణయ్ అనే యువకుడిని కిరాయి హంతకులతో చంపించిన అమృత తండ్రి మారుతీ రావు.. ఎట్టకేలకు బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. మారుతీ రావు.. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులు శ్రవణ్ కుమార్, అబ్దుల్ కరీంలకు కూడా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న ఆ ముగ్గురు బెయిల్ పై విడుదలయ్యారు.

మాకు ప్రాణ హాని ఉంది.. అమృత

అయితే.. ముగ్గురు నిందితులు బెయిల్ పై విడుదలవ్వడంతో.. తమకు ప్రాణ హాని ఉందని ప్రణయ్ భార్య, మారుతీ రావు కూతురు అమృత వాపోతున్నారు. ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను, న్యాయస్థానాన్ని కోరుతామన్నారు. నిందితులు బయటికి వచ్చి సాక్ష్యాలను తారుమారు చేస్తారని.. వారి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతున్నట్టు అమృత తెలిపారు.

సుప్రీంకోర్టుకు పోలీసులు

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. నిందితులు బయటికి వస్తే కేసు సాక్ష్యాలు తారుమారు అవుతాయని… వాళ్ల బెయిల్ ను రద్దు చేసి వాళ్లను మళ్లీ జైలుకు తరలించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారట. ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత.. వారి సూచనలతో సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం తరుపున వాళ్లు పిటిషన్ వేయనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version