శివునికి ఇష్టమైన రోజు మహా శివరాత్రి రోజు విషాదం చోటు చేసుకుంది. దర్శనానికి అని శివ ఆలయానికి కొంత మంది కారులో వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో అక్కడి కక్కడే ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఈ విషాదాకర ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. కాగ ఛత్తీస్ ఘడ్ కు చెందిన కొంత మంది భక్తులు.. ఒడిశాలో ఉన్న శివ ఆలయం సందర్శనకు కారులో వెళ్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని నౌపాద జిల్లా సదార్ బ్లాక్ సునీసియా ప్రాంతం వద్దకు వచ్చే సరికి వేగంగా ఉన్న కారు.. అదుపు తప్పింది.
దీంతో ఆ కారు ఎదురుగా ఉన్న ఒక పెద్ద చోట్టును ఢీ కోట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడి కక్కడే మృతి చెందారు. స్థానికలు సమాచారంతో ఒడిశా రాష్ట్ర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న మృత దేహాలను బయటకు తీశారు. అలాగే ఈ ప్రమాదంలో పలువురు కూడా గాయ పడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.
కాగ మృతులంతా.. కూడా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మహా సముంద్ జిల్లాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వీరు మహా శివరాత్రి సందర్భంగా ఒడిశా లోని బర్గాండ్ జిల్లాలోని నృసింఘనాథ్ ఆలయానికి వస్తున్నట్టు పోలీసులు తెలిపారు.