బీఆర్ఎస్ చేసిన తప్పు కు ఏ నాయకుడైనా శిక్ష అనుభవించాల్సిందేనని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసినట్టు తెలిస్తే.. కేటీఆర్, హరీశ్ రావు, మాత్రమే కాదు.. కేసీఆర్, కవితకు సైతం శిక్ష తప్పదు అన్నారు. తప్పులు చేసిన వారు భుజాలు తడుముకుంటున్నారని సెటైర్లు వేశారు. ఫార్ములా-ఈ రేసు కేసు వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు అవుతానని ముందుగానే మానసికంగా సిద్ధం అవుతున్నారని విమర్శించారు.
అందుకే నేను అరెస్ట్ అయినా ఏమి భయపడను.. రెండు మూడు నెలలు జైలులో గడిపి యోగా చేసి ఫిట్ గా అయి మళ్లీ పాదయాత్ర చేస్తానని పేర్కొంటున్నాడని తెలిపారు. ముందుగానే కేటీఆర్ మానసికంగా సిద్ధం అవుతున్నారని దీనిని బట్టే అర్థమవుతుందన్నారు. ఈ అంశంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్ల రేసింగ్ పై అనేక విమర్శలు వచ్చాయని.. అసలు ఈ రేసింగ్ తో తెలంగాణ కు వచ్చిన ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.