వ‌న‌మా రాఘ‌వకు షాక్.. మ‌రో 14 రోజుల రిమాండ్

ఇటీవ‌ల కొత్త‌గూడెం జిల్లాలోని పాల్వంచ ప‌ట్ట‌ణంలో కుటుంబం మొత్తం ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వేంద్రరావు ను పోలీసులు జ‌న‌వరి 8వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేశాసిన విషయం తెలిసిందే. అప్పుడు వ‌న‌మా రాఘ‌వేంద్ర రావు ను అరెస్టు చేసిన పోలీసుల.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా ఈ రోజు కూడా వ‌న‌మా రాఘ‌వేంద్ర రావు రిమాండ్ మ‌రో 14 రోజుల పెంచుతూ తీర్పును ఇచ్చింది.

కాగ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌కు కోర్టు 14 రోజుల‌ రిమాండ్ విధించింది. కాగ నేటితో వ‌నమా రాఘ‌వేంద్ర రావు రిమాండ్ ముగిసింది. దీంతో ఆన్ లైన్ లో విచార‌ణ చేప‌ట్టాని కోర్టు.. మ‌రో 14 రోజుల రిమాండ్ ను విధించింది. కాగ పాల్వంచ ప‌ట్ట‌ణానికి చెందిన రామ కృష్ణ ఆత్మ హ‌త్య చేసుకునే ముందు.. త‌న‌ను త‌న భార్య‌ను వ‌న‌మా రాఘ‌వ వేధించాడ‌ని అందుకే ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నామ‌ని సెల్పీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియా ఆధారంగా వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు అరెస్టు చేశారు.