పాపం; విషపు గింజలు తిన్న 30 నెమళ్ళు…!

-

పంట పొలాలు నాశనం చేస్తున్నాయని ఒక వేటగాడు చేసిన పనికి 30 నెమళ్ళు ప్రాణాలు కోల్పోయాయి. వివరాల్లోకి వెళితే నెల రోజులుగా మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలంలో చెరువుముందు తండా అటవీ ప్రాంతం నుంచి నెమళ్లు ప్రతి రోజు గ్రామ శివారులోని పొలాల్లో ఉన్న ధాన్యం గింజలను తింటూ పంటలను నాశనం చేస్తూ తమకు నష్టం చేస్తున్నాయని గ్రామస్తులు ఒక వేటగాడికి చెప్పారు.

ఆ విషయాన్ని వేలుబెల్లి గ్రామానికి చెందిన ఓ వేటగాడికి చెప్పడంతో నెమళ్లను చంపేందుకు ఒక ఉపాయం గ్రామస్తులకు చెప్పాడు అతడు. గ్రామస్తులు సరే అనడంతో విషపు ఎరలు తయారు చేసుకుని లక్ష్మీనర్సుకుంట సమీపంలో ఉన్న అడవిలో వెదజల్లాడు. వాటిని తిన్న నెమళ్ళు ప్రాణాలు కోల్పోయాయి. తమ పంటలను వాటి నుంచి కాపాడినందుకు గాను వేటగాడికి గ్రామస్తులు కొంత నగదు కూడా ఇచ్చారు.

అంత వరకు బాగానే ఉంది గాని వాటి కాళ్లు, ఈకలు, తల తీసేసి మాంసం కిలో రూ.200లకు విక్రయిస్తున్నట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన ఎఫ్‌ఆర్వో లక్ష్మీనారాయణ విచారణ కోసం సిబ్బందిని పంపించామని, పూర్తి వివరాలను దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గ్రామస్తులు, వేటగాడిపై అధికారులు జంతు సంరక్షణ చట్టం కింద కేసులు పెట్టినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news