స్పా ముసుగులో స్వర్గం చూపిస్తున్నారా…?

-

స్పా ముసుగులో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఇలా చాలా నగరాల్లో వ్యభిచార ముఠాలు స్పాలను వాడుకుంటూ పెద్ద ఎత్తున తమ కార్యాకలాపలను చాలా ధైర్యంగా నిర్వహిస్తున్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే ఇవి క్రమంగా ఎక్కువైపోతున్నాయి. కొంత మంది పోలీసుల సహకారంతో రెచ్చిపోతున్నారు.

తాజాగా బెంగళూరు నగరంలో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. స్పా మాటున సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు పక్కా ఆధారాలతో ఈ గుట్టుని రట్టు చేశారు. బెంగళూరు నగరంలోని మహదేవపుర ప్రాంతంలోని హూడీ గ్రామంలో స్పా లో రహస్యంగా ఆరుగురు మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని బెంగళూరు సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో సిటీ క్రైంబ్రాంచ్ పోలీసులు వ్యూహాత్మకంగా ఆకస్మిక దాడులు చేసి వ్యభిచారం నుంచి ఆరుగురు మహిళలను పోలీసులు కాపాడారు. స్పా నిర్వాహకులైన ముగ్గురు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఇలా ఒక్క బెంగళూరు నగరంలోనే కాకుండా చాలా నగరాల్లో ఈ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. దీనితో చాలా మంది జేబులు గుల్ల కూడా చేసుకుంటున్నారు. కుటుంబంలో వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news