తండ్రి కారు కింద ప‌డి బాలుడు మృతి

తండ్రి కారు న‌డుపుతు ఉన్న స‌మ‌యంలో కుమారుడు కారు కింద పడి చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్ బీ న‌గ‌ర్ లో జ‌రిగింది. త‌న కారు ను వాష్ చేస్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కాగ‌ హైద‌రాబాద్ లోని ఎల్ బీ న‌గ‌ర్ లో ల‌క్ష్మ‌న్ రాణి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి సొంత గ్రామం సంగారెడ్డి జిల్లా జ‌హీరాబాద్. వీరి 4 సంవ‌త్స‌రాల భ‌వాని అనే కూతురు ఉంది.

అలాగే ఏడాది న్న‌ర సాత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే లక్ష్మ‌న్ కార్ డ్రైవ‌ర్ గా పని చేస్తున్నాడు. ఆది వారం సాయంత్రం త‌న కారు ను వాష్ చేసాడు. అనంత‌రం పార్క్ చేయాల‌ని త‌న ఇన్నోవా కారు రివార్స్ తీశాడు. అయితే వెన‌కాల నుంచి వ‌చ్చిన త‌న కుమారుడు సాత్విక్ ను ల‌క్ష్మ‌ణ్ గ‌మ‌నించలేదు. దీంతో కారు సాత్విక్ పై నుంచి వెళ్లింది. దీంతో సాత్విక్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ద‌గ్గ‌ర లోని ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. అయితే సాత్విక్ అప్ప‌టికే మృతి చెందాడ‌ని వైద్యులు తెలిపారు. అయితే పోలీసు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.