తండ్రి, కొడుకుల మధ్య చిచ్చు పెట్టిన చికెన్.. అతి దారుణంగా చంపి…

-

నాన్ వెజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. దొరికితే లాగించకుండా ఉండరు.. కొన్ని సార్లు చికెన్ బొక్క కోసం కొట్టుకున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.. ఇటీవల బలగం సినిమాలో నల్లి బొక్క ఇవ్వలేదని బావ, బామ్మర్థుల మధ్య ఎన్నో ఏళ్లు మాటలు లేవు..ఇప్పుడు తాజాగా తండ్రీ కొడుకుల మధ్య చికెన్ చిచ్చు పెట్టింది..చిన్న విషయానికే అవతలి వాళ్ళను విచక్షణలేకుండా చంపుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు ఈ ఘటన కూడా అంతే..


చికెన్ కర్రీ విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఇంట్లో వండిన చికెన్‌ కర్రీ మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు గొడవకు దిగాడు..ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి.. కుమారుడి తల పగలగొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని సూలీయా తాలూకా గుత్తిగర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది..

వివరాల్లోకి వెళితే..శివరామ్ (33) అనే వ్యక్తి కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం పనిమీద బయటకు వెళ్లాడు. అయితే అదే రోజు ఇంట్లో కోడి కూర వండగా.. కుమారుడికి కొంచెం కూడా ఉంచకుండా తండ్రి సీన మొత్తం తినేశాడు. పనిముగించుకొని తిరిగొచ్చిన శివరామ్‌ విషయం తెలుసుకుని తండ్రితో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి.. పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కుమారుడి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శివరామ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.. కేసు నమోదు చేసుకొని, మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version