విదేశాల్లో రామ్ చరణ్ క్రేజ్.. ఆ దేశంలో రంగస్థలం రీరిలీజ్

-

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్. ఈ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో విదేశాల్లో సైతం రామ్ చరణ్ పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం పలు దేశాల్లో అతని క్రేజ్ సమాంతరంగా పెరిగిపోవడంతో విదేశాల్లో సైతం రామ్ చరణ్ సినిమా లు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు విదేశాల్లో సైతం సిద్ధమవుతుండటం విశేషం. ఐదేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సుకుమార్ డైరెక్షన్, క్రియేటివిటీకి తగ్గట్టు రామ్ చరణ్ నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి. సమంత నటన సైతం రంగస్థలం సినిమాకు హైలెట్ అయ్యాయి. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది నటుడుగా రామ్ చరణ్ ను మరొక స్థాయికి తీసుకువెళ్లిన ఈ సినిమా లో చిట్టిబాబు పాత్ర ఎప్పటికీ చెప్పాలి ఇక ఈ సినిమాతో సమంత పెరిగిపోగా మళ్లీ దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీస్ కు సిద్ధమవుతుంది అది కూడా జపాన్ దేశంలో.

మన సౌత్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అక్కడ రజనీకాంత్, ఎన్టీఆర్ సినిమాలను బాగా ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే మన సినిమాలు ఎన్నో విడుదలై అక్కడ మంచి పేరు సంపాదించుకున్నాయి. అయితే గత ఏడాది విడుదలైన ఆర్ఆర్అర్ సినిమాకు సైతం అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో జపాన్‌లో చరణ్‌కు విపరీతమైన పాపులారిటీ రాగా ఈ క్రమంలో రంగస్థలం సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జపాన్‌లోని చొగో సిటీలో షో వేస్తున్నారు. దీనికి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి థియేటర్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version