ప్రాణం తీసిన క్రిప్టో కరెన్సీ

క్రిప్టో క‌రెన్సీ లో భారీ గా పెట్టు ప‌డులు పెట్టిన వ్య‌క్తి న‌ష్టాలు రావ‌డం తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రం లో ని సూర్యా పేట లో జ‌రిగింది. గుండె మెడ రామ‌లింగ స్వామి (36) ఖ‌మ్మం న‌గ‌రంలో నివాసం ఉంటున్నాడు. రామ లింగ స్వామి ఆన్ లైన్ లో బిజినెస్ చేయాల‌ని భావించాడు. ప్ర‌స్తుతం క్రిప్టో క‌రెన్సీ లో పెట్టు బ‌డులు పెట్టిన వారికి ఈ మ‌ధ్య కాలం లో చాలా మందికి లాభాలు వ‌చ్చాయ‌ని తెలుసుకున్నాడు.

మ‌రో ఇద్ద‌రు మిత్రు ల తో క‌లిసి క్రిప్టో క‌రెన్సీ లో భారీ గా పెట్టు ప‌డులు పెట్టారు. కానీ వారు పెట్టు ప‌డులు పెట్టిన క్రిప్టో క‌రెన్సీ న‌ష్టాల్లో కి వెళ్ల‌డం తో రామ లింగ స్వామి మ‌న స్థాపానికి గురి అయ్యాడు. సూర్యాపేట ప‌ట్ట‌ణానికి వ‌చ్చాడు. ఒక ప్ర‌యివేటు లాడ్జిలో మంగళవారం పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే లాడ్జీ రూం నుంచి బ‌య‌ట కు రాక‌పోవ‌డం అలాగే గ‌ది లో నుంచి దుర్వాస‌న రావ‌డం తో బుధవారం లాడ్జీ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. పోలీసులు తలుపులు తెరిచి చూడ‌గా రామ‌లింగ స్వామి విగ‌తి జీవిల ప‌డి ఉన్నాడు. దీంతో పోలీసు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే రామ లింగ స్వామి వ‌ద్ద త‌న భార్య‌కు రాసిన లేఖ ను పోలీసులు గుర్తించారు. త‌న ఆత్మ‌హ‌త్య కు గ‌ల కార‌ణాల‌ను ఆ లేఖ లో రాసాడు.