ఇష్టంలేని పెళ్లి చేసుకున్న కూతురు.. అల్లుడిని నడి రోడ్డుపై చంపిన తండ్రి

-

అల్లరు ముద్దుగా పెంచుకున్నారు.. కంటనీరు కారకుండా కాపాడుకున్నారు.. అడిగిందల్లా ఇచ్చారు.. కానీ కన్న పేగు తమ మాట వినకుండా మరొకరిని ఇష్టపడడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వద్దన్నా వినకుండా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడాన్ని తట్టుకోలేకపోయారు. కన్న కూతురు తమ మాట వినలేదని ఆ తల్లిదండ్రులు మనస్థాపానికి గురయ్యారు. మానసికంగా కుంగిపోయారు. చివరకు ప్రాణాలు తీయడానికి సైతం సిద్ధపడ్డాడు ఆ తండ్రి.

అసలేం జరిగిందంటే.. తమిళనాడులో రెండు నెలల క్రితం తల్లిదండ్రులకు చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శరణ్య – జగన్ లు. అయితే తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందని కసితో మధ్యాహ్నం ఇంటికి వెళుతున్న అల్లుడు జగన్ ని అడ్డగించి కత్తులతో పొడిచి చంపాడు శరణ్య తండ్రి, అతని స్నేహితులు. తమిళనాడు క్రిష్ణగిరి సమీపంలోని కెఆర్పి డ్యాం హైవే రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శరణ్య తండ్రిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news