ఆస్తి కోసం కొడుకుని చంపడానికి 3 లక్షల సుపారీ

Join Our Community
follow manalokam on social media

ఒక వ్యాపారవేత్త తన సొంత కొడుకును బెంగళూరులో చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్న సంఘటన సంచలనం అయింది. కొడుకు… ఆస్తిలో వాటా కోసం తల్లిదండ్రులను హింసించాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బెంగళూరులోని మల్లేశ్వరం 17 వ క్రాస్ నివాసి అయిన బి.వి.శేషవ (50) ను ఇప్పుడు తన పెద్ద కుమారుడిని హత్య చేసిన ఆరోపణలపై అవనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 12 న తండ్రి తన పెద్ద కుమారుడు కౌషల్ ప్రసాద్ జనవరి 10 నుండి ఇంటికి తిరిగి రాలేదని పేర్కొంటూ ఒక ఫిర్యాదు దాఖలు అయింది. కౌషల్ మొబైల్ ఫోన్ చిన్న కొడుకుకు ఇచ్చినట్లు తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కౌషల్ కోసం వెతకడం ప్రారంభించగా, ఆ ప్రాంత వాసులు ఎలిమల్లప్ప సరస్సు వద్ద విసిరిన కొన్ని గన్నీ సంచుల నుండి వెలువడే దుర్వాసన గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గన్నీ సంచులు తెరిచి చూడగా… మానవ శరీర భాగాలను చూసిన పోలీసులు షాక్ అయ్యారు. మృతదేహాన్ని తప్పిపోయిన కౌషల్ మృతదేహంగా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. నిఘా కెమెరాల ప్రకారం… మల్లేశ్వరం 18 వ క్రాస్ సమీపంలో తెల్లటి మారుతి జెన్ కారులో ఆ శవాన్ని తీసుకొచ్చారు. ఈ కేసులో నవీన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా… బాధితురాలి తండ్రి తమకు 3 లక్షల రూపాయలు ఇచ్చి చంపాలని చెప్పాడని పేర్కొన్నాడు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...