BREAKING : సెప్టిక్ ట్యాంక్​లో దిగి ముగ్గురు యువకులు మృతి

-

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ఘోరం జరిగింది. సెప్టిక్ ట్యాంక్ మూతను తెరిచే క్రమంలో ముగ్గురు యువకులు విషపూరిత వాయువులు పీల్చి మరణించారు. మృతులు చౌబేపుర్​ ప్రాంతానికి చెందిన నందు (18), అతని సోదరుడు మోహిత్ (24), సాహిల్ (16)గా పోలీసులు గుర్తించారు. నందు, మోహిత్.. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు చేపడుతుంటారు. వారి దగ్గర సాహిల్ అనే యువకుడు కూలీగా పనిచేస్తున్నాడు.

మొదటగా సాహిల్.. సెప్టిక్ ట్యాంక్​లోకి వెళ్లి విషపూరిత వాయువులు పీల్చి స్పృహ కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు ట్యాంక్​లో దిగిన నందు, మోహిత్ కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు యువకులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వీరు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇటీవల సెప్టిక్ ట్యాంక్​ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కార్మికులు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్​ కోసం ఇంకా కార్మికులే స్వయంగా వాటిలో దిగుతున్నారు. విషపూరిత వాయువు పీల్చి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం మనుషుల్ని కాకుండా యంత్రాలను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు పలువురు కార్మికులు.

Read more RELATED
Recommended to you

Latest news