జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్ లలో రాత్రి 10 తర్వాత నో మ్యూజిక్ – హైకోర్టు

-

పబ్స్ వ్యవహారంపై నేడు హైకోర్టు లో మరోసారి విచారణ చేపట్టింది ధర్మాసనం. జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్ లలో రాత్రి 10 తర్వాత నో మ్యూజిక్, డీజే లకు అనుమతి లేదని మరోసారి స్పష్టం చేసింది హైకోర్టు. గతంలో రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ బంద్ అంటూ సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పు ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళ్లాయి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్, హైదరాబాద్ రెస్ట్రో లాంజ్ అసోసియేషన్.

దీంతో నేడు మరోసారి ధర్మాసనం విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్ లో ఉన్న 10 పబ్ లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది హై కోర్టు. టాట్, జూబ్లీ 800, ఫర్జీ కేఫ్,అమ్నిషియ, హై లైఫ్, డైలీ డోస్, డర్టీ మార్టిని, బ్రాడ్వే, హార్ట్ కప్ పబ్ లలో రాత్రి 10 తర్వాత మ్యూజిక్ కి అనుమతి లేదని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news