యువతులతో ఒకడు అశ్లీల వీడియోలు తీస్తే.. ఇంకొకడు బేరం కుదరక వాట్సప్ లో పెట్టేశాడు..!

-

మొగల్తూరులో ఓ యువకుడు సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అయితే.. అతడి షాప్ కు వచ్చే యువతులకు గాలమేయడం మొదలుపెట్టాడు. యువతులు కూడా మనోడి ట్రాప్ లో పడిపోయేవారు.

యువతులతో అశ్లీల వీడియోలు తీసింది ఒకడు. ఆ వీడియోలను గమనించి వాటిని తన ఫోన్ లో ఎక్కించుకొని ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని వీడియోలు తీసిన వ్యక్తితో బేరమాడాడు మరొకడు. కానీ.. బేరం కుదరక చివరకు ఆ వీడియోలను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో చోటు చేసుకున్నది.

మొగల్తూరులో ఓ యువకుడు సెల్ ఫోన్ రిపేర్ షాప్ నడుపుతున్నాడు. అయితే.. అతడి షాప్ కు వచ్చే యువతులకు గాలమేయడం మొదలుపెట్టాడు. యువతులు కూడా మనోడి ట్రాప్ లో పడిపోయేవారు. కొందరు అమ్మాయిలతో మనోడు హద్దు దాటేవాడు. వాళ్లతో శృంగారం జరిపి.. వీడియోలు తీసి తన మొబైల్ లో దాచుకునేవాడు. కాకపోతే వాటిని ఎవ్వరికీ చూపించేవాడు కాదు. ఆ వీడియోలన్నింటినీ తన కంప్యూటర్ లో ఓ ఫోల్డర్ లో పెట్టి దాచుకునేవాడు. అయితే.. అతడి షాప్ లోనే పనిచేసే మరో వ్యక్తి ఆ వీడియోలను గమనించి.. వాటన్నింటినీ తన ఫోన్ లో ఎక్కించుకున్నాడు.

అంతే కాదు.. ఆ వ్యక్తి, మరోవ్యక్తి కలిసి ఆ వీడియోలను చూపించి.. మొదటి వ్యక్తిని బెదిరించి డబ్బులు గుంజాలని చూశారు. మొదటి వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ వీడియోలను వాట్సప్ లో చేశారు. దీంతో ఆ వీడియోల్లో ఉన్న ఓ బాధితురాలు ఆ వీడియో చూసి వెంటనే మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వీడియోలు తీసిన వ్యక్తిని, వాటిని వాట్సప్ లో షేర్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి.. వారి నుంచి వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version