వనపర్తి జిల్లాలోని పెబ్బేరు లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరా కాలువ దూకింది. ఇది గమనించిన స్థానికులు ఒక మూడేండ్ల బాలుడిని రక్షించగా.. తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి చెందారు. కుటుంబ కలహాలతోనే భవ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.
పెబ్బేరు పట్టణానికి చెందిన స్వామి, భవ్యలు భార్య భర్తలు. వీరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కూతర్లు, ఒక కుమారుడు కలరు. కొద్ది రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు భార్యకు తెలియడంతో తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ తరుణంలో భార్య భవ్య జూరాల ప్రధాన ఎడమ కాలువ వద్దకు వెళ్లి పిల్లలతో కలిసి దూకింది. స్థానికులు గమనించి బాలుడిని కాపాడగలిగారు. ఇద్దరు కూతుర్లతో పాటు ఆ మహిళ గల్లంతుఅయ్యారు. పోలీసులు ప్రత్యేకంగా గాలింపులు చేపట్టించి మూడు మృతదేహాలను వెలికి తీయించారు. ముగ్గురు మృతుల్లో తల్లి భవ్య, కూతుర్లు జ్ఞానేశ్వరి నిహారిక మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఆసుపత్రికి తరలించారు.