టీవీ నటి ఝాన్సీ సూసైడ్ కేసు: ఆమె ఆత్మహత్య ముందు ఏం జరిగింది?

-

పవిత్ర బంధం సీరియల్ లో నటించిన నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది. ఇదివరకే ఆమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఝాన్సీ చనిపోవడానికి కొన్ని గంటల ముందు సూర్యకు కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అప్పుడు సూర్య.. ఝాన్సీని తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. దీంతో ఝాన్సీ మనస్థాపానికి గురయి… ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు.

సూర్య.. ఝాన్సీకి ఎప్పుడూ షరతులు పెడుతుండేవాడు. ఝన్సీని ఎప్పుడూ అనుమానిస్తుండేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఝాన్సీకి ఇష్టమైన నటనను కూడా బలవంతంగా మార్పించాడు సూర్య. ఇలా రోజురోజుకూ మితిమీరిపోతున్న సూర్య వేధింపులను తట్టుకోలేకనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు.. ఝాన్సీ కుటుంబ సభ్యులు కూడా ఝాన్సీ ఆత్మహత్యకు సూర్యే కారణమని పోలీసులకు వెల్లడించారు. తమ కూతురును పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలని ఝాన్సీ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version