chandrababu dharma porata deeksha looks like reality showదాదాపు 10 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేసిన ధర్మపోరాట దీక్ష పక్కా రియాల్టీ షోను తలపించింది. చంద్రబాబు దీక్షలో ఉన్నవాళ్లంతా టీడీపీ మద్దతుదారులే. పేరుకు దీక్ష ఏపీకోసం.. తొక్కా తోలు అంటూ చెప్పినా.. ఖర్చు చేసింది ప్రజా ధనం. అందులోనూ.. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో దీన్ని ప్లస్ పాయింట్ చేసుకోవడం వేసిన ఎత్తుగడ. నిజంగా ఏపీ ప్రజల కోసం.. ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్షేమీ కాదు. ఎన్నికలకు సరిగ్గా రెండుమూడు నెలల ముందు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడంటే.. ఇది పక్కా ఓట్లను తనవైపుకు రాబట్టుకోవడానికి వేస్తున్న స్టంట్.
అక్కడికి వచ్చిన జాతీయ నాయకులు కూడా చంద్రబాబు మీద ప్రేమతో వచ్చిన వాళ్లు కాదు… మోదీ మీద వ్యతిరేకతతో వచ్చినవాళ్లు.. అది కూడా చంద్రబాబు బతిలాడి మరీ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్లను ఢిల్లీకి పిలిపించుకొని పొగిడించుకున్నాడు. ఆ దీక్షలో అదే కనిపించింది. ఆయన దీక్షకు మద్దతుగా వచ్చిన వాళ్లను చంద్రబాబు పొగడడం… చంద్రబాబును వాళ్లు పొగడడం.. వచ్చిన వాళ్లను ఆహ్వానించడం.. పోయే వాళ్లను సాగనంపడం.. చంద్రబాబు చేసింది ఇదే దీక్షలో. ఆ దీక్షలో ఏపీకి చెందిన ఒక్క కాంగ్రెస్ నేత కూడా హాజరు కాలేదు. జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలు హాజరయినప్పుడు.. ఏపీ కాంగ్రెస్ నేతలు హాజరయితే వచ్చిన నష్టమేంది. ఇందులో ఉన్న మతలబేమిటో మరి. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం ఏపీలో ధర్నా చేయడానికి వచ్చిన రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులపై చంద్రబాబు కోడిగుడ్లు, టమోటాలు వేయించాడు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. దానిపై రాహుల్ గాంధీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చిన తర్వాతనే ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ కాంగ్రెస్ నేతలు చంద్రబాబును డిమాండ్ చేశారు.
దీక్షను వదిలి ఢిల్లీని చూడటానికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు..
చంద్రబాబు ఢిల్లీ దీక్ష కోసం ఉత్తరాంధ్ర నుంచి దాదాపు కోటీ 20 లక్షలు ఖర్చు పెట్టి మరీ… రెండు రైళ్ల ద్వారా తెలుగు తమ్ముళ్లను తరలిస్తే.. వాళ్లు మాత్రం దీక్షాస్థలం వద్ద ఉండకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయి ఢిల్లీ అంతా తిరిగారు. దీక్ష ప్రాంగణంలలో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే కనిపించడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యాడు. తమ్ముళ్లంతా ఎక్కడికీ వెళ్లొద్దు… కుర్చీల్లో కూర్చోవాలంటూ అభ్యర్థించాడు. ఇలా ఆధ్యంతం దీక్షా స్థలం రియాల్టీ షోను తలపించింది.