ఇన్నాళ్లూ భర్తలు భార్యలను వేధింపులకు గురి చేయడం.. క్షణికావేశంలో హత్య చేయడం వంటి ఘటనలు జరిగేవి. కానీ ట్రెండ్ మారింది అన్నట్లుగా ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భార్యలు భర్తలను హతమారుస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పెళ్లంటే భయపడుతున్న యువత ఈ ఘటనలతో మరో అడుగు వెనకేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
తాజాగా హర్యానాలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తపై దాడి చేయించింది. ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల గౌరవ్ కు ఇటీవల నేహ అనే యువతితో పెళ్లి ఫిక్స్ అయింది. అయితే టీచర్ గా పనిచేస్తున్న గౌరవ్.. ఈనెల 17న ఇంటికి వెళ్తున్న సమయంలో అతడిపై దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు కాళ్లు, చేతులు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గౌరవ్ ఇప్పుడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. అయితే తమకు కాబోయే కోడలు నేహనే తమ కుమారుడిపై దాడి చేయించిందని గౌరవ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.