హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్ కి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శనివారం HCA కి అంబుడ్స్ మన్ జస్టీస్ ఈశ్వరయ్య ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ చేసిన పిటిషన్ పై అంబుడ్స్ మన్ విచారణ నేపథ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ HCA అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు గుర్తించారు.
ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ యాజమాన్యాల మధ్య ఉచిత పాస్ ల కేటాయింపు పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. పాత ఒప్పందం ప్రకారం.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యంలో 10 శాతం కాంప్లీమెంటరీ పాస్ లను HCA కి కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహించేందుకు SRH కి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది HCA. ఇది జరిగిన రెండు వారాలకే మరోసారి కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.