కూలి పనికి వెళ్తున్న కొమురంభీం మనవడు

-

ఆదివాసీ నేత, సామాజిక ఉద్యమకారుడు.. ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన నేత కొమురంభీమ్ గురించి తెలియని వారుండరు. తెలంగాణ ప్రజలు భీమ్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ఉద్యమ నాయకుడి కుటుంబం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు సమాచారం. చేతిలో చిల్లిగవ్వ లేక గిరిజన వీరుడు కొమురంభీం మనవడు కుమురం సోనేరావు కూలి పనికి వెళ్తున్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం దోబే గ్రామంలో నివాసముంటున్న కుమురం సోనేరావు, గౌరుబాయి దంపతులు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డబ్బులు లేక 15 రోజులుగా ఈ దంపతులు ఉపాధి హామీ పథకం కూలి పనికి వెళ్తున్నారు. ప్రభుత్వం గతంలో ఐదెకరాల సాగుభూమి ఇచ్చినా.. తలదాచుకునేందుకు ఇల్లు లేదని వాపోయారు.
పలుమార్లు ఇంటి కోసం ఎమ్మెల్యే, కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించినా.. ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గుస్సాడీ రాజుకు ఇచ్చిన గౌరవం మాదిరిగానే.. తనను గుర్తించి ఆదుకోవాలని, నెలనెల ఆసరా పింఛను అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news