ప్రియుడి మోజులో పడి కన్న కూతురును…

-

ప్రియుడి మోజులో పడింది. దీంతో పేగు తెంచుకొని పుట్టిన కూతురునే చిత్రహింసలు పెట్టింది. దాదాపు 8 నెలల పాటు ఓవైపు తల్లి, మరోవైపు ఆమె ప్రియుడు వేధిస్తున్నా… తట్టుకొని నిలబడింది ఆ చిన్నారి. అసలు.. తనపై ఎందుకు దాడికి పాల్పడుతున్నారో తెలియని అమాయకత్వంలో కాలాన్ని వెళ్లదీసింది. చివరకు ఈ విషయం బయటికి రావడంతో ఆ అమ్మాయికి విముక్తి కలిగింది.

ఈ ఘటన ఏపీలోని వైజాగ్ లో చోటు చేసుకున్నది. విశాఖపట్టణం జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన భర్త చనిపోవడంతో గత ‘సంవత్సరం నుంచి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఆమెకు 11 ఏళ్ల కూతురు ఉంది. రోజు ఇంటికి వచ్చి తనను వేధిస్తూ ఉండేవాడు తల్లి ప్రియుడు. ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. గత ‘8 నెలల నుంచి ఇలాగే ప్రతి రోజూ వేధిస్తుండేవాడు. తల్లి కూడా ప్రియుడికి వత్తాసు పలికేది. ఇలాగే గత శనివారం రాత్రి కూడా తాగి వచ్చి ఆ అమ్మాయిని వేధించాడు. కర్రతో కొట్టాడు. ఆ బాలిక బట్టలు విప్పి రూంలో పెట్టి తాళం వేశాడు. అప్పటికే తనకు రెండు రోజుల నుంచి అన్నం పెట్టకుండా తనను చిత్రహింసలు పెట్టారు. దీంతో తీవ్రంగా నీరసించి పోయింది ఆ అమ్మాయి. నీరసించిపోయిన అమ్మాయి తనను కాపాడాలంటూ అరవడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను వాళ్ల చెర నుంచి విడిపించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలికను హింసించిన తల్లి, ఆమె ప్రియుడిపై కేసు పెట్టిన పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version