‘యాత్ర’ ట్రైలర్.. అంచనాలు పెంచిన వైఎస్సార్ బయోపిక్..!

-

మహి వి రాఘవ్ డైరక్షన్ లో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న సినిమా యాత్ర. వైఎస్ పాదయాత్రం నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో వైఎస్ గా మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఈ సినిమాకు సంబందించి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజైంది. ప్రజల కోసం పాటుపడిన మహానేతగా వైఎస్ ఎలాంటి ప్రస్థానం కొనసాగించారు.

ఆయన పాదయాత్రలో తెలుసుకున్న విషయాలు.. ఆ తర్వాత ఆయన చేపట్టిన పథకాలు మొత్తం ఈ సినిమాలో చూపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ మనసుని కదిలించేలా ఉన్నాయి. మాట ఇచ్చాక ముందుకెళ్లాల్సిందే అంటూ చెప్పిన డైలాగ్ బాగుంది. సినిమా ట్రైలర్ అంచనాలు పెంచగా ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version