నేటికాలంలో పాపాలు చేసే వారంతా పెద్దమనుషులుగా చెలామని అవుతున్నారనడానికి నిదర్శనమే ఇప్పుడు మనం చదవబోయే ఘటన.. ఈ సంఘటన విన్నతర్వాత నిజంగా మనం కంప్యూటర్ యుగంలో ఉన్నామా అనే అనుమానం తప్పక కలుగుతుంది.. అసలు సాటి మనుషులను మనుషులుగా చూడలేని ఈ సమాజాన్ని చూసి గర్వపడటం నిజంగా దురదృష్టకరం.. ఇక ఇప్పుడున్న మనుషుల్లో మానవత్వం పూర్తిగా నశించింది.. శవాలతోనే కాదు, ఆడవాళ్ల శీలాలతో కూడా నీచ రాజకీయాలు చేసే పెద్దమనుషులు తిరుగుతున్న ఈ పుడమిలో మంచితనం ఎప్పుడో మరణించిందనడానికి ఇక్కడ జరుగుతున్న నేరాలే సాక్ష్యాలుగా చెప్పవచ్చు..
ఇకపోతే నాగరికులమని చెప్పుకుంటూ, అనాగరికుల్లా జీవిస్తున్న నేటికాలంలో సాటి ఆడపిల్ల శీలానికి వెలకట్టి ఆ వచ్చిన సొమ్మును దోచుకున్న నీతిలేని పెద్దమనుషులను ఏం చేస్తారో మీ యిష్టం.. ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే.. వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో ఉన్న ఓ తండాలో నివసిస్తున్న ఒక యువతిపై స్థానిక యువకుడు ఒకడు అత్యాచారానికి పాల్పడగా ఈ విషయాన్ని ఆ యువతి కుంటుంబ సభ్యులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి తమ కూతురుకు న్యాయం చేయమని వేడుకోగా వారంత పంచాయితి నిర్వహించారు.. ఆ పంచాయితీలో సదరు కామాంధుడికి జరిమానగా రూ.2లక్షలు విధించారు..
అయితే ఈ మొత్తాన్ని బాధితురాలికి అందచేయాలని తీర్పు చెప్పి సమస్యను పరిష్కరించారు.. దీనికి బాధితురాలి కుటుంబం కూడా సమ్మతించడంతో ఆ డబ్బును పెద్దలు నిందితుడి నుంచి వసూలు చేశారు. అయితే ఇక్కడే ఆ పెద్దమనుషుల బుద్ది గడ్డితిని వచ్చిన సొమ్ములో ఒక్క రూపాయి కూడా ఆ యువతికి ఇవ్వకుండా పెద్దలే రాబంధుల్లా మింగేసారట. ఇక ఎన్నిరోజులైన పెద్దమనుషులు డబ్బుల విషయంలో వెనకడుగు వేస్తుండటంతో ఆరాతీసిన బాధిత కుంటుంబ సభ్యులకు అసలు నిజం తెలిసి గ్రామ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట..
ఒక అమ్మాయి శీలానికి వెలకట్టడమే తప్పు, అలాంటిది వచ్చిన సొమ్ము వారికి ఇవ్వకుండా దోచుకున్న వీరిని పెద్దమనుషులు అనడం కంటే బ్రోకర్లు అనడం మంచిదని దుమ్మెత్తిపోస్తున్నారు స్దానికులు.. ఏదైనా వీరు చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు..