BREAKING : వ్యూస్‌ రావడం లేదని యూట్యూబర్‌ డీనా ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లోదారుణం చోటు చేసుకుంది. సైదాబాద్‌ లో య్యూటూబర్‌ డీనా అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. లైవ్‌లో గేమ్స్‌ ఆడుతూ య్యూటూబ్‌లో వ్యూయర్స్‌ను పెంచిన డీనా… ఇవాళ ఉదయం సూసైడ్ చేసుకున్నారు. ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న డీనా… యూట్యూబ్‌లో వ్యూయర్స్‌ పెరగడం లేదంటూ ఆందోళన చెందారు.

ఈ నేపథ్యంలోనే.. కొద్ది సేపటి క్రితమే యూట్యూబ్‌ లైవ్‌లో గేమ్‌ ఆడిన డీనా… భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గేమ్‌ ఆడుతూ తన బాధను చెప్పుకున్న డీనా… సూసైడ్ చేసుకున్నారు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచనలు కూడా చేసి.. సూసైడ్ చేసుకున్నారు. లైవ్‌లో గేమ్స్‌ ఆడడంలో డీనా దిట్ట అని సమాచారం అందుతోంది. యూట్యూబ్‌లో selflo గేమ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్న డీనా.. సూసైడ్ చేసుకోవడం హైదరాబాద్‌ లో కలకలం రేపుతోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news