కలెక్టర్ వాట్సాప్ డీపీ తో పైసలు వసూలు చేస్తున్న కేటుగాళ్లు

-

అక్రమంగా డబ్బు సంపాదన కోసం వాట్సాప్ లో జిల్లాస్థాయి ఆఫీసర్ల ఫోటోలు వాట్సాప్ డీపీ లు గా పెట్టుకొని ఎమర్జెన్సీ ఉంది, ఈ నెంబర్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి పని మెసేజ్ లు పెడుతున్నారు కేటుగాళ్లు.అదిలాబాద్ కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశంలో ఉన్న కొందరు అధికారుల ఫోన్ లకు ఓ ఫోన్ నెంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ చేసి అత్యవసర సమావేశం లో ఉన్నాను, డబ్బులు అవసరం ఉంది, డబ్బులు పంపండి అని వాట్సాప్ కు మెసేజ్ లు వచ్చాయి.డిపి చూస్తే మాత్రం కలెక్టర్ ఫోటో ఉంది.ఆశ్చర్యపోయిన అధికారులు వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణమే కలెక్టర్ తన పెషీ ద్వారా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.ఇదే క్రమంలో ఒక ప్రభుత్వ వైద్యుడు మోసపోయాడు.కలెక్టర్ డిపి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి డబ్బులు పంపాలి అని వాట్సాప్ మెసేజ్ లు రాగానే ఆయన స్పందించి, తన బంధువు కు డబ్బులు పంపితే ఆయన పది వేల విలువైన 10 అమెజాన్ కూపన్లు కొన్ని అవతలి వ్యక్తికి పంపాడు.మళ్లీ రూ.1.50 వేలు కావాలి అని మెసేజ్ వస్తే అనుమానం వచ్చి ఆ వైద్యుడు కలెక్టర్ పేషి ని సంప్రదిస్తే విషయం అర్థమైంది.వెంటనే ఆ కూపన్లను క్యాన్సిల్ చేయించగా రూ. 70 వేలను వెనక్కు రాబట్టుకోగలిగాడు.

Read more RELATED
Recommended to you

Latest news