నురగ కక్కుతూ చనిపోతున్న కాకులు…!

-

కరోనా ఏమో గాని ఇప్పుడు జనాలకు ఏది జరిగినా సరే భయ౦ వేస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా సరే కరోనా అనే భయం జనాలను వెంటాడుతుంది. అమెరికాలో పులికి కరోనా వైరస్ సోకింది. అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో కుక్కకు జ్వరం వచ్చినా తుమ్మినా దగ్గినా సరే జనాలకు భయం పట్టుకుంది. చాలా మంది పెంపుడు కుక్కలను తమ ఇంటికి దూరంగా కట్టేస్తున్నారు. వీధిలోకి కూడా తీసుకుని వెళ్ళడం లేదు.

తమిళనాడులో కాకులకు కరోనా వైరస్ వచ్చింది అనే ప్రచారం కూడా జనాలను బాగా ఇబ్బంది పెట్టింది. అక్కడ భారీగా కాకులు చనిపోతున్నాయని ప్రచారం జరుగుతుంది. దీనికి కారణం కరోనా వైరస్ అని ప్రచారం చేసారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా కాకులు నురగ కక్కుకుని చనిపోతున్నాయి. దీనితో ప్రజల్లో భయం వ్యక్తమవుతుంది. ఎం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారు బూరుగు గుంటలో రెండు రోజులుగా నోటి నుంచి నురగలు వచ్చి కాకులు చనిపోతున్నాయి. దీనితో వెంటనే గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో అమలాపురం పశుసంవర్ధక శాఖ డీడీ ఏసురత్నం గ్రామంలో పర్యటించి చనిపోయిన కాకికి పోస్ట్ మార్టం కూడా చేసారు. కాకులను ల్యాబ్ కి పంపి పరిక్షలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news