సూపర్ స్టార్ సినిమా విషయంలో పరశురామ్ కి ఇది షాకా ట్విస్టా పాపం…?

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత వంశీపైడి పల్లి సినిమాతో రెడీ అవుతారని బాగా ఊదరగొట్టారు. మహర్షి కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఈసారి ఇండస్ట్రీ రికార్డ్స్ టార్గెట్ చేస్తున్నారన్న న్యూస్ కూడా బాగా వైరలైంది. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్నాయి కాబట్టి వంశీ పైడిపల్లి కూడా మహేష్ బాబు ని ఆలాగే ప్రజెంట్ చేయబోతున్నారన్న టాక్ కూడా బాగా సాగింది. అంతేకాదు దసరా సందర్భంగా రిలీజ్ కూడా అవుతుందన్న మాట కూడా వినిపించింది. కాని వంశీ పైడిపల్లి తో ప్రాజెక్ట్ అనూహ్యంగా ఆగిపోయింది. కథ నచ్చక మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నుండి డ్రాపయ్యారు.

 

అయితే మే నుంచి ఎఫ్ 3 లో నటిస్తారని మొన్నటి వరకు అనుకున్నారు. సరిలేరు ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా రూపొందనుందన్న సంగతి తెలిసందే. అయితే ఈ సినిమా డిలే అయ్యో అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకి గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికి త్వరలో మహేష్ బాబు పరశురామ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందట. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే కియారా మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. అందువల్ల ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా కూడా నటించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ పరశురామ్ కి మేకర్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం నెలకొన్న కరోనా సమస్యలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని రకాల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

ముఖ్యంగా నిర్మాతలు సినిమా నిర్మాణంలో బడ్జెట్ ని బాగా కంట్రోల్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పరశురామ్ కి రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు షాకిచ్చినట్టు తెలుస్తుంది. ముందు కమిటయిన రెమ్యూనరేషన్ కంటే బాగా తక్కువ ఇస్తామని అంటున్నారట. ఒకవేళ పరిస్థితులు చక్కబడి సినిమా సూపర్ హిట్ అయితే ప్రాఫిట్ లో షేర్ ఇస్తామన్నట్టుగా చెప్పారట. ఇది ఇప్పుడు పరశురామ్ కి షాకా ట్విస్టా అర్థం కాక డైలమాలో ఉన్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news