విశాఖ వరలక్ష్మి మర్డర్ : క్రిమినల్ సినిమాలు చూసి భారీ ప్లాన్

విశాఖలో సంచలనం రేపిన వరలక్ష్మి మర్డర్ కేసులో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసు నిందితుడు అఖిల్ సాయి ప్రేమ మాటను పగ పెంచుకుని ఈ హత్యకు స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. తనకు బ్రేకప్ చెప్పగానే తనకు దూరమైన వరలక్ష్మి మరెవరికీ దక్కకూడదనే కోపంతోనే అత్యంత దారుణంగా హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హత్య చేయడంతో పాటు ఆ హత్యానేరం తన మీద పడకుండా ఉండేందుకు పలు క్రిమినల్ సినిమాలను హత్యకు ముందు అఖిల్ చూసినట్లు చెబుతున్నారు. హత్య చేశాక ఆధారాలు దొరక్కుండా క్లూస్ టీంకి కూడా ఒక్క చిన్న క్లూ దొరక్కుండా క్లూస్ అన్నీ డిస్ట్రబ్ చేసేలా కొన్ని ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపడానికి ముందు ధైర్యం కోసం గంజాయి సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ కోణంలో విచారణ కొనసాగుతుందని దిశా ఎసీపే ప్రేమ కాజల్ పేర్కొన్నారు