హేమంత్ హత్య కేసు.. కీలక అంశాలు వెల్లడించిన పోలీసులు !

-

హేమంత్ కేసులో ఈరోజుతో నిందితుల కస్టడీ ముగియడంతో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఈ కేసుకు సంబందించిన విషయాలు మీడియాలో వెల్లడించారు. హేమంత్ మర్డర్ కేస్ లో పరారీలో ఉన్న ఎరుకాల కృష్ణ,మహమ్మద్ పాషా ( లడ్డు),రాజు ,సాయన్న ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. హేమంత్ ను చంపిన తరవాత మృతదేహం పై ఉన్న బంగారు ఆభరణాలను ఎరుకాల కృష్ణ తీలుకొని వెళ్ళాడని, ఎరుకాల కృష్ణ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు సీజ్ చేయటం జరిగిందని అన్నారు.

 

ప్రేమ వివాహం నచ్చకపోవడంతో హేమంత్ ను చంపాల్సి వచ్చిందని కస్టడీలో ఉన్న లక్ష్మ రెడ్డి ఒప్పుకున్నాడన్న ఆయన హేమంత్ ను చంపేందుకు 10 లక్షలు కాదు 30 లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అని మా విచారణలో లక్ష్మారెడ్డి చెప్పాడని అన్నారు. మిగిలిన ఏడూ మందిని కూడా పోలీస్ కస్టడీ తీసుకొని విచారిస్తామన్న ఆయన సిఐ శ్రీనివాస్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ఈ కేస్ బాధ్యతలు గచ్చిబౌలి డిఐ కాస్ట్రో చూస్తారని అన్నరు. అవంతిక రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర ఇందులో ఇప్పటివరకు లేదని మా విచారణలో తేలిందని అన్నారు. ఈ కేసులో మరింతగా దర్యాప్తు చెయ్యాల్సి ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news