ఈ నెల 18వ తేదీన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణ జరగనుంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో సచివాలయంలో అభియోగాలపై విచారణ జరగనుంది. సాక్షులుగా మాజీ డీజీలు రాముడు, సాంబశివరావు, మాల కొండయ్య, ఆర్పీ ఠాకూర్ లు ఉండనున్నారు. సాక్షులుగా విచారణకు హాజరు కావాలని మాజీ డీజీలకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపినట్టు చెబుతున్నారు.
ఏబీపై శాఖాపరమైన విచారణ ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రోజువారీ విచారణ చేపట్టాలని విచారణాధికారికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. విచారణ నివేదికను మే 3 తేదీ నాటికి కోర్టుకు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టిన విచారణ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్ధించారు, అయితే క్వాసీ జ్యుడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.