శ్రావణి ఆత్మహత్య కేసులో పురోగతి.. అందుకే సూసైడ్ ?

ఎట్టకేలకి సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య విషయంలో పోలీసులు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి – సాయిల మధ్య జరిగిన వివాదమే ఈ ఆత్మహత్యకు కారణమని కీలకం కానుంది. ఎందుకంటే  రోడ్డు పై శ్రావణి ని సాయి బెదిరిస్తున్నవన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. శ్రావణి ని సీరియస్ గా సాయి బెదిరిస్తుండడం, శ్రావణిని ఆటో లో ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం  సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

సాయి ఆమెను బెదిరిస్తుండడంతో భయపడి పోయిన శ్రావణి, చివరకు ఆటో ఎక్కేందుకు నిరాకరించడంతో ఆటోని పంపేశాడు. అలా పంపేసి కూడా డ్డు మీద నిలబడిన శ్రావణి తో చాలాసేపటి వరకు వాగ్వివాదం పెట్టుకున్నాడు సాయి, చివరకు సాయి బెదిరింపులు తట్టుకోలేక ఆటో ఎక్కిన ఆమె ఇంటికి వెళ్ళాక ఈ విషయం మీద గొడవ పడినట్టు తెలుస్తోంది. రేపు ఎస్సార్ నగర్ పోలీసుల ముందు సాయి కృష్ణ విచారణకు రానున్నాడు. శ్రావణిని బెదిరించే ఫుటేజ్ లభ్యం కావడంతో అదే విచారణకు కీలకం కావచ్చని భావిస్తున్నారు.