దేశంలో వచ్చే జులై నాటికి 20 నుంచి 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. 40 నుంచి 50 కోట్ల డోసుల వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. టీకా పంపిణీలో మొదటి ప్రాధాన్యత వైద్య సిబ్బందికేనన్న ఆయన టీకా ఎవరికి అవసరమో
ప్రాధాన్యతా క్రమంలో జాబితా ఇవ్వాలని రాష్ట్రాలకు అక్టోబర్ చివరి వరకు గడువు ఇచ్చామని అన్నారు హర్షవర్ధన్.
విదేశీ టీకా ఏదైనా సురక్షితం, సమర్థవంతం అని తేలినా అది భారత ప్రజలకు సురక్షితమా? కాదా? అనే దానిపై అధ్యయనం జరిపిస్తామని ఆయన అన్నారు హర్షవర్ధన్. రష్యా తయారు చేసిన
స్పుత్నిక్ టీకా దిగుమతిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. భారత ప్రజలకు ఏది మంచిదో ఆలోచించి మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన అన్నారు. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్న ఆయన వ్యాక్సిన్ సిద్దమైన తర్వాత తక్కువ ధరకు అందించే ప్రయత్నం చేస్తామని అన్నారు.