హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ నిలిపివేశారు.దీంతో స్టేడియం పరిసరాలన్నీ చీకటిని అలుముకున్నాయి. చాలా రోజులుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినా హెచ్‌సీఏ అధికారుల్లో చలనం లేకపోవడంతో గురువారం(ఏప్రిల్ 4) టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు.. విద్యుత్ సరఫరను నిలిపివేశారు.బిల్స్ కట్టకుండా రూ.1.67 కోట్ల విద్యుత్ వినియోగించారని అధికారులు తెలిపారు. దీనిపై 2015లోనే కేసు నమోదు చేశామని, 15 రోజుల క్రితం నోటీసులు పంపామని వెల్లడించారు.
కాగా, ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం(ఏప్రిల్ 5) ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉన్నట్టుండి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో.. ఆ మ్యాచ్ పై అనిశ్చితి నెలకొంది.అసలు మ్యాచ్ జరుగుతుందా..! లేదా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.