BREAKING : కోట్లల్లో బిల్లులు పెండింగ్.. ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్

-

ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ శాఖ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియానికి… కరెంట్ నిలిపివేసారు విద్యాశాఖ అధికారులు. కోట్లలో బత్తాయిలు పేరుకుపోవడంతో… విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సప్లై ను నిలిపివేశారు. కరెంటు బిల్లు లు కట్టక పోవడం తో… గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై విద్యుత్ శాఖ కేసు వేసింది.

దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.. కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో… వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు విశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు విద్యుత్ అధికారులు. ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం పై ఏకంగా మూడు కోట్లకు పైగా బిల్లులు ఉన్నట్లు సమచారం అందుతుంది. తక్షణమే…ఆ బిల్లులు కట్టాలని… అప్పటి వరకూ… కరెంట్ నిలిపివేస్తామని అధికారులూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version