గుజరాత్‌కు చెందిన వ్యక్తి దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు? కానీ, బెంగాలీ ఎందుకు వెళ్లకూడదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆమె ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఉత్తర గోవాలోని అస్సోంనొరాలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించారు.
నన్ను బెంగాలీ అని పిలుస్తున్నారు. అతను( ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి) ఎవరు? అతనో గుజరాతీ. ఆయన గుజరాతీ. కాబట్టి ఇక్కడికి రావొద్దని మేం అనాలా? జాతీయ గీతాన్ని బెంగాలీ రాయవచ్చు కానీ, గోవాకు బెంగాలీ రాకూడదా? అని ప్రశ్నించారు. గాంధీజీని మనమంతా గౌరవిస్తాం. గాంధీజీ బెంగాలీవా లేదా బెంగాలీయేతరవాడా లేదా గోవా వాడా లేదా యూపీకి చెందినవాడా అని మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? అందరిని కలుపుకుని వెళ్లే నాయకుడే జాతీయ నాయకుడు అవుతాడు అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.