రాత్రి సమయంలో షాకింగ్ ఘటన.. ఆరుగురు మృతి

గుంటూరు: రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో విషాదం చోటు చేసుకుంది. రొయ్యలచెరువు వద్ద ఒక్కసారిగా విద్యుత్ఘాతం ఏర్పడింది. చెరువుగట్టుపై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో కరెంట్ షాక్ కొట్టి ఆరుగురు మృతి చెందారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేందర్, నవీన్‌గా గుర్తించారు. వీరంతా రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్నారు. మృతులు ఒడిషా నుంచి వచ్చి లంకెవానిదిబ్బలో పని చేస్తున్నారు.

రోజూ మాదిరి రాత్రి చెరువు గట్టుపై వీరు నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఒకరు కరెంట్ షాక్‌కు గురయ్యారు. దీంతో కాపాడేందుకు వెళ్లిన మరొకరు, వారికోసం వెళ్లిన ఇంకొకరు అలా ఆరుగురికి కరెంట్ షాక్ కొట్టినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రొయ్యల చెరువు యాజమానిని కూడా ప్రశ్నించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.