ఒలింపిక్స్‌లో దీపికా కుమారి దూకుడు… ప్రీక్వార్టర్స్‌లో అద్భుత విజయం

-

టోక్యో: ఒలింపిక్స్‌లో దీపికా కుమారి అద్భుతంగా రాణిస్తున్నారు. మహిళల విభాగంలో స్వర్ణ పతకమే లక్ష్యంగా ఆర్చరీలో దూకుడు చూపుతున్నారు. ప్రీక్వార్టర్స్‌లో తన బాణానికి పదును పెట్టారు. దీంతో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు. తొలుత నెమ్మదిగా కనిపించిన దీపికా.. ప్రస్తుతం టార్గెట్ దిశగా దూసుకుపోతున్నారు. ఫలితంగా ప్రీక్వార్టర్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేశారు. రష్యా ఒలింపిక్ కమిటీ ఆర్చర్‌పై ఘన విజయం సాధించారు. పెరివా సెనియాపై 6-5 తేడాతో దీపికా కుమారి గెలిచారు. దీంతో ఒలింపిక్స్‌లో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

కాగా పురుషుల విభాగంలోనూ భారత ఆర్చరీ ప్లేయర్ అతాను దాస్ కూడా సత్తాచాటుతున్నారు. గురువారం దక్షిణ కొరియా ఆర్చర్‌పై గెలిచి ఫ్రీకార్టర్స్‌కు దూసుకెళ్లారు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో కొరియా ఆర్చర్‌ను ఓడించారు. ఎలిమినేషన్ రౌండ్‌లో జిన్ హెక్‌పై 6-5తేడాతో దాస్ విజయం సాధించారు. గత ఒలింపిక్స్‌లో జిన్ హెక్ స్వర్ణ పతకం సాధించి విజేతగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news